Jagan Passport Cancelled: ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ లండన్ ప్రయాణం వాయిదా పడింది. ఆయనకు పాస్‌పోర్టుకు సంబంధించిన సమస్యలు ఎదురవవ్వడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. జగన్‌కు ముఖ్యమంత్రి పదవి లేకపోవడంతో డిప్లోమాటిక్ పాస్‌పోర్ట్ రద్దు అయ్యింది. ఆయన జనరల్ పాస్‌పోర్ట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు.. విజయవాడ ప్రజా ప్రతినిధుల కోర్టులో కూడా విచారణ జరగ్గా.. ఏడాది పాటూ పాస్‌పోర్టుకు కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే జగన్ ఐదేళ్ల పాటూ పాస్‌పోర్ట్ ఇవ్వాలంటూ హైకోర్టును ఆశ్రయించారు.