జగిత్యాల చిన్నారి దత్తత కేసులో ట్విస్ట్.. హైకోర్టు ఉత్తర్వులపై కలెక్టర్ పిటిషన్

1 hour ago 1
జగిత్యాల చిన్నారి దత్తత వివాదం మరోసారి హైకోర్టుకు చేరింది. మూడేళ్లుగా పెంపుడు తల్లిదండ్రుల వద్ద పెరుగుతున్న బాలుడిని దత్తత ప్రక్రియ చట్టబద్ధంగా జరగలేదన్న ఫిర్యాదుతో అధికారులు శిశుగృహకు తరలించారు. బాలుడిని హైకోర్టు తల్లిదండ్రులకు అప్పగించాలని ఆదేశించగా.. శిశుగృహలో చిన్నారి ఏడుస్తున్న వీడియో వైరల్ కావడంతో అధికారులు అప్పగింత ప్రక్రియ పూర్తి చేశారు. తాజాగా ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ జగిత్యాల కలెక్టర్ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. దత్తత చట్టబద్ధతను పరిశీలించాలని.. విచారణ పూర్తయ్యే వరకు బాలుడిని తిరిగి సీడబ్ల్యూసీ సంరక్షణలో ఉంచాలని కోరారు.
Read Entire Article