జగిత్యాల పట్టణంలో తల్లి ప్రేమకు అద్దం పట్టే హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. ఓ రైతు ఇంట్లో తల్లి ఆవు దూరమవడంతో.. లేగదూడ ఆకలితో అల్లాడిపోయింది. బిడ్డ ఆవేదన చూసి చలించిన రైతు.. దూడను ఆటోలో ఎక్కించుకుని తల్లిని వెతుకుతూ పట్టణం మొత్తం తిరిగాడు. కొత్త బస్టాండ్ వద్ద తల్లి ఆవు కనిపించగా.. బిడ్డను చూసి పట్టలేని ఆనందంతో ఆవు ఆటో వెంట ప్రాణాలకు తెగించి పరుగెత్తింది. ఈ అపురూప దృశ్యం మూగజీవాల్లోని నిస్వార్థ మాతృ ప్రేమకు నిదర్శనంగా నిలిచింది.