ఏపీ సర్కారు ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. ముఖ్యంగా రెండు నెలల క్రితమే కొత్త సూపర్ లగ్జరీ బస్సులు కొనుగోలు చేసినప్పటికీ.. వాటిని రోడ్లపై నడిపే మోక్షం కల్గలేదు. కనీసం అవి రిజిస్ట్రేషన్‌కు కూడా నోచుకోలేవు. అందులో ఫైర్ డిటెక్టివ్ అలారం లేకపోవడం వల్లే ఇంత జాప్యం జరిగింది. కానీ ఆర్టీసీ అందులో వీటిని ఏర్పాటు చేసేందుకు ఓకే చెప్పింది. అందుకు తగ్గట్లుగానే త్వరగా వాటిల్లో అలారాన్ని ఏర్పాటు చేసింది. దీంతో 75 కొత్త సూపర్ లగ్జరీ బస్సులు జగ్గయ్యపేట, తిరువూరు, విజయవాడ, ఆటో నగర్ బస్ డిపీల్లో నడవబోతున్నాయి.