హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై ఉన్న 23 కిలోమీటర్ల అత్యాధునిక సైకిల్ ట్రాక్‌ను ఐటీ కారిడార్‌తో పూర్తిస్థాయిలో అనుసంధానించేందుకు హెచ్‌ఎండీఏ పరిధిలోని అర్బన్ మాస్ ట్రాన్సిట్ అథారిటీ (UMTA) సమగ్ర ప్రణాళికను సిద్ధం చేసింది. ప్రస్తుతం నానక్‌రాంగూడ, నార్సింగి పరిసరాల్లో ఉన్న ఈ ట్రాక్‌ను ఐటీ ఉద్యోగులకు అందుబాటులోకి తెచ్చేలా గచ్చిబౌలి, హైటెక్ సిటీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ పరిధిలోని 10 కీలక మార్గాలను అధికారులు గుర్తించారు. దీనివల్ల రోడ్లపై ట్రాఫిక్ రద్దీ తగ్గడంతో పాటు వర్షాల సమయంలో వాహనదారుల ఇబ్బందులు తప్పుతాయని అంచనా.