ఇటీవల కాలంలో రకరకాల మోసాలు వెలుగులోకి వస్తున్నాయి. అత్యాశపరులను టార్గెట్ చేస్తున్న కేటుగాళ్లు వారి ఈజీగా మోసం చేసి అందిన కాడికి దోచుకుంటున్నారు. తాజాగా.. జనగామ జిల్లాలో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. యాప్‌లో పండ్లు, పండ్ల రసాలు, ఐస్‌క్రీంలు కొనుగోలు చేస్తే భారీగా లాభాలంటూ మోసం చేశారు. దాదాపు 2 వేల మంది నుంచి రూ. 15 కోట్లు కొల్లగొట్టారు.