Konidela Nagababu Appointed As Ap Green Society Chairperson: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సోదరుడు, ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబుకు కీలక పదవి దక్కింది. ఆయన్ను రాష్ట్ర పర్యావరణ, అటవీశాఖ గ్రీన్ కార్యనిర్వాహక కమిటీ ఛైర్మన్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. నాగబాబుకు కేబినెట్ ర్యాంకు కూడా దక్కింది. నాగబాబు గతేడాది ఎమ్మెల్సీగా ఎన్నికకాగా.. మంత్రి పదవి వస్తుందని ప్రచారం జరిగింది. అయితే తాజాగా ఆయనకు కేబినెట్ హోదాతో పదవి దక్కింది.