జలమండలి కొత్త ప్రణాళిక.. పరిశ్రమలు, డేటా సెంటర్లకు శుద్ధి చేసిన మురుగునీటి విక్రయం

1 hour ago 2
హైదరాబాద్‌లో శుద్ధి చేసిన మురుగునీటిని పరిశ్రమలు, డేటా సెంటర్లు, నిర్మాణ రంగ అవసరాలకు విక్రయించేందుకు జలమండలి ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ నీటిని సరఫరా చేసేందుకు ప్రత్యేక గ్రీన్ ట్యాంకర్లను అందుబాటులోకి తీసుకురానుంది. కాగా, ధరలు ఇంకా నిర్ణయించలేదు. గ్రేటర్ పరిధిలో సుమారు 800 గేటెడ్ కమ్యూనిటీల్లో ఉన్న ఎస్టీపీల సామర్థ్యం, రోజువారీ ఉత్పత్తి, నీటి నాణ్యత వివరాలను డిజిటల్ డేటాబేస్‌లో నమోదు చేయనున్నారు. ట్యాంకర్ బుకింగ్‌కు యాప్, ఆన్‌లైన్ సదుపాయాలు కల్పించనున్నారు. ఈ విధానం ద్వారా తాగునీటిపై ఒత్తిడి తగ్గించడంతో పాటు పునర్వినియోగ నీటి వినియోగాన్ని పెంచాలని జలమండలి లక్ష్యంగా పెట్టుకుంది.
Read Entire Article