గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. విశాఖ ప్రత్యేకతను చాటేలా, విశాఖలోని చారిత్రక కట్టడాలను పరిచయం చేసేలా విశాఖలో హెరిటేజ్ వాకింగ్ ట్రాక్ నిర్మించనుంది. వన్ టౌన్ ప్రాంతంలో ఈ హెరిటేజ్ వాకింగ్ ట్రాక్ నిర్మించనున్నారు. 1.6 కిలోమీటర్ల పొడవు, ఆరు ఆడుగుల వెడల్పుతో ఈ వాకింగ్ ట్రాక్ నిర్మించాలని ప్రణాళికలు రచించారు. ఈ ప్రాజెక్టుకు ఇప్పటికే జీవీఎంసీ స్టాండింగ్ కౌన్సిల్ ఆమోదం తెలిపింది.