జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ ఓటమి తర్వాత.. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ట్విట్టర్ వేదికగా ‘కర్మ హిట్స్ బ్యాక్’ అంటూ చేసిన ట్వీట్ రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించింది. ఈ సంచలన పోస్ట్, పార్టీలో తనకు తగిన గౌరవం దక్కలేదని భావిస్తున్న కవిత వర్గానికి, బీఆర్‌ఎస్ అంతర్గత నాయకులకు మధ్య నెలకొన్న విభేదాలకు అద్దం పడుతోంది. పార్టీలో జరిగిన తప్పుడు నిర్ణయాల పర్యవసానమే ఈ ఓటమని ఆమె పరోక్షంగా సూచించారు. కవిత విమర్శలను హేళన చేసినవారికి ఈ ఫలితం చెంప పెట్టు అని అభిమానులు భావిస్తున్నారు. ఈ ట్వీట్ బీఆర్‌ఎస్‌లో త్వరలో నాయకత్వ మార్పు లేదా అంతర్గత ప్రక్షాళనకు దారి తీయవచ్చు.