జూబ్లీహిల్స్‌లో బోగస్‌ ఓట్లు.. కీలక వ్యాఖ్యలు చేసిన హైకోర్టు..

4 months ago 10
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రసవత్తరంగా మారింది. అటు ప్రచారంతో పాటు విమర్శలు, ప్రతివిమర్శలు చేసుకుంటున్నాయి అధికార, ప్రతిపక్ష పార్టీలు. ఈ నేపథ్యంలో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బోగస్ ఓట్ల అంశం కలకలం రేపింది. దీనిపై బీఆర్ఎస్ నేతలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారించిన హైకోర్టు.. ఈ సమయంలో మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయలేమని తేల్చి చెప్పింది. ఇప్పటికే ఎలక్టోరల్స్‌ను ఎన్నికల సంఘం రివిజన్‌ చేస్తోందని వెల్లడించింది. కాగా ఇటీవల ఒకే చిరునామాలో 43 ఓట్లు ఉన్నాయని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు.
Read Entire Article