విజయనగరం జిల్లా భోగాపురం విమానాశ్రయం పనులు జెట్ స్పీడుతో జరుగుతున్నాయి. ఎయిర్పోర్టు నిర్మాణ పనులకు భూమి పూజ చేసిన ఏడాదిలోపే పనుల్లో సగం పూర్తయ్యాయి. ఈ విషయాన్ని కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. ఆదివారం సాయంత్రం భోగాపురం ఎయిర్పోర్టు పనులను కేంద్ర మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులను ప్రశంసించిన మంత్రి.. రాకెట్ స్పీడుతో పనులు చేయిస్తున్నారని అభినందించారు. మరో 16 నెలల్లో భోగాపురం ఎయిర్పోర్టు సేవలు మొదలవుతాయని ధీమా వ్యక్తం చేశారు.