తెలంగాణ కాంగ్రెస్‌లో అంతర్గత పరిణామాలు కాకరేపుతున్నాయి. తనను, తన కుటుంబాన్ని టార్గెట్ చేసుకున్నారని ఆరోపిస్తూ మంత్రి కొండా సురేఖ.. టీపీసీసీ క్రమశిక్షణ కమిటీకి శనివారం మరో లేఖ రాశారు. తనను టార్గెట్ చేసి, అవమానకర వ్యాఖ్యలు చేస్తున్న వారి వెనుక ఎవరు ఉన్నారనేది గుర్తించి చర్యలు తీసుకోవాలంటూ టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ మల్లు రవికి కొండా సురేఖ లేఖ రాశారు. కమిటీ తనకు ఇచ్చిన నోటీసుకు ఇప్పటికే వివరణ ఇచ్చానన్న కొండా సురేఖ.. అయినా కూడా కొంతమంది కాంగ్రెస్ నేతలు, ప్రజాప్రతినిధులు.. తన పట్ల అవమానకర రీతిలో వ్యాఖ్యలు చేస్తున్నారని కొండా సురేఖ పేర్కొన్నారు.