AP Govt TIDCO Houses Application Fees Refund: ఏపీలో టిడ్కో ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకుని.. ఫ్లాట్లు రాని వారికి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. మొత్తం 65వేలమంది వరకు డబ్బుల్ని వెనక్కు ఇచ్చేస్తోంది.. డబ్బులు చెల్లించే ప్రక్రియ ప్రారంభమైనట్లు ఏపీ టిడ్కో ఛైర్మన్ తెలిపారు. ఈ నెల 31లోపు డబ్బులు అందరి అకౌంట్‌లలో జమ చేస్తున్నట్లు తెలిపారు. మొత్తం 65,136మందికి రూ.106 కోట్లు ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది.