టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. హిందూ దేవాలయాలకు రాయితీ మీద మైక్ సెట్లు, దేవతా విగ్రహాలు, శేష వస్త్రాలు, గొడుగులను అందిస్తోంది. ఆసక్తి కలిగిన వారు దరఖాస్తు చేసుకోవాలంటూ తిరుమల తిరుపతి దేవస్థానం ఓ ప్రకటనలో వెల్లడించింది. మైక్ సెట్ల విషయానికి వస్తే ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాల వారికి ఏకంగా 90 శాతం రాయితీ అందిస్తోంది. దరఖాస్తులను తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనం అడ్రస్‌కి పంపించాలని టీటీడీ కోరింది.