TTD Trust Board Two Years Term Ends Today: టీటీడీ పాలక మండలి కాలపరిమితి నేటితో ముగుస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన టీటీడీ పాలకమండలిని, ఛైర్మన్‌గా బీఆర్ నాయుడ్ని 2024 నవంబర్ 1న నియమించింది. ఈ పాలకమండలి రెండేళ్ల పదవీ కాలం శనివారంతో ముగుస్తోంది. ఈ క్రమంలో నూతన పాలకమండలి నియామక అంశం తెరపైకి వచ్చింది. ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో.. ఆ పక్రియ ముగిసిన తర్వాతే కొత్త పాలకమండలిని నియమించే అవకాశం ఉందంటున్నారు.