Ttd Engineering Posts Cbt Exams Dates: తిరుమల తిరుపతి దేవస్థానం ఇంజినీరింగ్ విభాగంలోని పోస్టుల భర్తీకి సంబంధించి కీలక ప్రకటన విడుదల చేసింది. ఈ ఉద్యోగాల భర్తీ కోసం మే 10, 11 తేదీలలో ఆన్‌లైన్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT) విధానంలో రాత పరీక్షలను నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సీబీటీ ద్వారా టీటీడీకి సంబంధించిన ఏఈఈ (సివిల్), ఏఈఈ (ఎలక్ట్రికల్), ఏఈ (సివిల్), ఏటీవో (సివిల్) పోస్టులను భర్తీ చేయనున్నారు.