Satyavedu Tdp Sankar Reddy: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో టీడీపీ అధిష్టానం సంచలన నిర్ణయం తీసుకుంది. సిట్టింగ్ ఎమ్మెల్యే ఉండగానే ఆ నియోజకవర్గానికి కొత్త ఇంఛార్జ్‌ను నియమించడం చర్చనీయాంశంగా మారింది. కూరపాటి శంకర్ రెడ్డికి సత్యవేడు నియోజకరవర్గం సమన్వయ బాధ్యతలు అప్పగించడంతో రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ఇది మిగతా ఎమ్మెల్యేలకు సంకేతమా? లేక సమన్వయం కోసమా? వేచి చూడాల్సిందే. ఈ పరిణామం రానున్న ఎన్నికల్లో ఎలాంటి మార్పులు తీసుకొస్తుందో చూడాలి.