Buddha Venkanna Good News To Flood Victims: విజయవాడలో వరద బాధితులకు మాజీ ఎమ్మెల్సీ, టీడీపీ నేత బుద్దా వెంకన్న అండగా నిలిచారు. విజయవాడలో టీడీపీ కోసం పని చేసిన, వరదతో నష్టపోయిన కార్యకర్తలను ఆదుకునేందుకు ముందుకు వచ్చారు. వారి ఇళ్లల్లో టీవీలు, ఫ్రిజ్ లు, ఇతర గృహోపకరణాలు నష్టపోయారు.. వారందరికీ తన సతీమణి బుద్దా భూలక్ష్మి, అల్లుడు కాండ్రేగుల రవీంద్ర ద్వారా ఈ వస్తువులు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేశానని తెలిపారు.