Former Mla Vunnam Hanumantharaya Chowdary Died: టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ చౌదరి (81) కన్నుమూశారు. కొంతకాలంగా ఆయన ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మార్క్‌ఫెడ్ చైర్మన్‌గా పనిచేశారు. 2014-2019 మధ్య కళ్యాణదుర్గం ఎమ్మెల్యేగా పనిచేశారు. ఉమ్మడి అనంతపురం జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా, రాష్ట్ర రైతు విభాగం అధ్యక్షుడిగా 10 ఏళ్లు పనిచేశారు. సర్పంచ్ స్థాయి నుంచి ప్రస్థానం ప్రారంభించి ఎమ్మెల్యే వరకు వెళ్లారు