Indiaan Cricketer Sri Charani Rs 2.5 Crore: టీమిండియా మహిళా క్రికెటర్ శ్రీచరణికి ఏపీ ప్రభుత్వం ప్రోత్సాహకాలను అందజేసింది. ప్రపంచకప్‌లో రాణించిన ఆమెకు రూ.2.5 కోట్ల నగదు ప్రోత్సాహకం, 500 గజాల ఇంటి స్థలం, గ్రూప్-1 ఉద్యోగం ప్రకటించింది. అయితే ఇవాళ మంత్రి నారా లోకేష్ స్వయంగా ఆమెకు రూ.2.5 కోట్ల చెక్ అందజేశారు. శ్రీచరణి ఇటీవల డబ్ల్యూపీఎల్‌లో భారీ ధరకు అమ్ముడై, శ్రీలంకతో టీ20 సిరీస్‌కు ఎంపికైంది.