ట్యాంక్‌బండ్‌పై అర్ధరాత్రి బర్త్‌డే వేడుకలు వద్దు.. యువతకు సీపీ సజ్జనార్ వార్నింగ్

1 hour ago 3
హైదరాబాద్‌లో అర్ధరాత్రి వేళ బహిరంగ ప్రదేశాల్లో పుట్టినరోజు వేడుకలు నిర్వహించడంపై సీపీ సజ్జనార్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ట్యాంక్‌బండ్‌పై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆరేళ్ల చిన్నారి, ఆమె బంధువు మృతి చెందిన నేపథ్యంలో ఆయన ఈ సూచనలు చేశారు. ప్రమాద ప్రాంతాన్ని పరిశీలించిన పోలీసులు, ఇతర ప్రభుత్వ శాఖలతో కలిసి భద్రతా చర్యలపై సమీక్ష నిర్వహించారు. ట్యాంక్‌బండ్‌పై వేడుకలు నిషేధమని, జీహెచ్‌ఎంసీ ఆదేశాలు అమల్లో ఉన్నాయని సజ్జనార్ గుర్తుచేశారు. యువత, తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండి, రాత్రివేళ రోడ్లు, సరస్సులు, పార్కుల వద్ద వేడుకలు జరపకుండా సహకరించాలని కోరారు.
Read Entire Article