స్థానిక ఎన్నికలకు ఏపీ సిద్ధమవుతుంది. బీసీల కోటాపై సుప్రీంకోర్టులో క్లారిటీ రావడంతో అతి త్వరలో మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. ఈ మేరకు డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ స్థానిక సంస్థ ఎన్నికలపై దృష్టి సారించారు. ఈ మేరకు ప్రత్యేక అడ్‌హాక్ కమిటీలను ఏర్పాటు చేశారు. ఈ కమిటీలు క్షేత్రస్థాయిలో పరిస్థితులపై సమాచారాన్ని సేకరించనున్నాయి. స్థానిక సంస్థ ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు ఈ కమిటీలు కొనసాగుతాయి.