automatic traffic challan: రోడ్డు ప్రమాదాల నివారణకు కేంద్రం నూతన సంస్కరణలు అమలు చేసేందుకు రెడీ అవుతోంది. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే ఆటోమేటిక్‌గా చలానాలు విధించేందుకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని రాష్ట్రాలకు సూచించింది. పాత వాహనాలను తుక్కుగా మార్చే వారికి ప్రోత్సాహకాలు అందివ్వనుంది. ఈ సంస్కరణలు అమలు చేసే రాష్ట్రాలకు నిధులు ముందుగా విడుదల చేస్తామని కేంద్రం తెలిపింది. 2030 నాటికి రోడ్డు ప్రమాదాలను 50% తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీనిలో భాగంగా ఆటోమెటిక్ ట్రాఫిక్ చలానాలు విధించే యోచనలో ఉంది.