పాపటపల్లి-డోర్నకల్ మధ్య మూడో రైల్వే లైన్ నిర్మాణ పనుల కారణంగా ఖమ్మం మీదుగా వెళ్లే పలు రైళ్లను అక్టోబర్ 14 నుంచి 19 వరకు రద్దు చేశారు. కొన్ని రైళ్లు పూర్తిగా, మరికొన్ని పాక్షికంగా రద్దు చేశారు. ఈ మేరకు సౌత్ సెంట్రల్ రైల్వే అలర్ట్ జారీ చేసింది. ప్రయాణికులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని రైల్వే అధికారులు సూచించారు.