డిష్ యాక్టివేషన్ కోసం ఆన్‌లైన్‌లో దొరికిన నంబర్‌కు ఫోన్ చేసి ఓ వ్యక్తి మోసపోయిన ఘటన తిరుపతి జిల్లాలో చోటుచేసుకుంది. తిరుపతి రూరల్ ధనలక్ష్మి నగర్‌కు చెందిన ఆర్టీసీ ఉద్యోగి సురేంద్రనాథ్ రెడ్డి.. గత నెలలో డిష్ యాక్టివేషన్ కోసం ప్రయత్నించారు. ఆన్‌లైన్‌లో దొరికిన కస్టమర్ కేర్ నంబర్‌కు ఫోన్ చేశారు. అయితే ఈ నంబర్ సైబర్ నేరగాళ్లకు చెందినది కావటంతో సురేంద్రనాథ్ రెడ్డి మోసపోయారు. బాధితుడి ఫోన్‌లో రిమోట్ యాక్సెస్ యాప్ డౌన్ లోడ్ చేయించిన కేటుగాళ్లు.. బ్యాంకు ఖాతాల నుంచి రూ. 1.18 లక్షలు కాజేశారు.