రాష్ట్రవ్యాప్తంగా డిసెంబర్ 1వ తేదీ నుంచి 9వ తేదీ వరకు ‘ప్రజా పాలన వారోత్సవాలు’ నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ వారోత్సవాల్లో ప్రజల నుంచి అందిన దరఖాస్తులను పరిశీలించడం.. కొత్త ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించడం వంటి కార్యక్రమాలు జరుగుతాయి. ఈ వారోత్సవాలు ముగిసిన తర్వాతే.. రాష్ట్ర ఎన్నికల సంఘంతో చర్చించి స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. అంటే డిసెంబర్ రెండో వారంలో స్థానిక సంస్థల ఎన్నికలు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు.