సింగరేణి సంస్థ మంచిర్యాల జిల్లా పెగడపల్లిలో నిర్మిస్తున్న 800 మెగావాట్ల కొత్త థర్మల్ ప్లాంట్ విద్యుత్తును తెలంగాణకు కాకుండా రాజస్థాన్‌కు విక్రయించాలని నిర్ణయించింది. ఇందుకోసం రాజస్థాన్ జెన్‌కోతో జాయింట్ వెంచర్ ఏర్పాటు చేస్తోంది. తెలంగాణ డిస్కంలు చెల్లించాల్సిన రూ. 27,379 కోట్ల భారీ బకాయిలే ఈ నిర్ణయానికి కారణమని తెలుస్తోంది. ఈ పరిణామం భవిష్యత్తులో తెలంగాణకు కరెంట్ కష్టాలతో పాటు వేల కోట్ల అదనపు ఆర్థిక భారాన్ని మోపే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.