తెలంగాణ డీజీపీగా సీవీ ఆనంద్ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో శాంతి భద్రతలు, ఇతర విషయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలోనే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపైనా డీజీపీ సీవీ ఆనంద్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు ప్రస్తుతం కీలక దశలో ఉందని.. త్వరలోనే రెండో ఛార్జ్‌షీట్‌కు సిద్ధమవుతున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టులు లొంగిపోవాలని డీజీపీ పిలుపునిచ్చారు. వారి పునరావాసంపై హామీ ఇచ్చారు.