ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో వేయి మీ మార్ట్‌లు ఏర్పాటు చేయనుంది. అక్టోబర్ ఒకటో తేదీ సీఎం నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా వీటిని ప్రారంభించనున్నారు. ఈ విషయాన్ని ఏపీ పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. డీ మార్ట్‌లకు పోటీగా.. అదే కాన్సెప్ట్ ఆధారంగా ఈ మీ మార్టులను తెస్తున్నామని.. వీటి ద్వారా తొలుత 64 సరుకులను ప్రజలకు అందుబాటులో ఉంచనున్నట్లు మంత్రి వివరించారు.