ఏపీ ప్రజలకు శుభవార్త.. కిలో ఉల్లిపాయలు రూ.32కే.. వచ్చే వారం నుంచే విక్రయాలు..

2 hours ago 1
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. మార్కెట్లో ఉల్లిపాయ ధరలు పెరిగిన నేపథ్యంలో.. రాయితీపై ఉల్లిని అందించాలని నిర్ణయించింది. రైతు బజార్ల ద్వారా కిలో ఉల్లిని రూ.32లకే అందించనున్నారు. వచ్చే వారం నుంచి రాష్ట్రంలోని 115 రైతు బజార్లతో పాటుగా.. మొబైల్ కేంద్రాల ద్వారా ఉల్లిని రాయితీపై అందించనున్నట్లు ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. అలాగే రాయితీపై కందిపప్పును కూడా రేషన్‌తో పాటుగా అందిస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు.
Read Entire Article