హైదరాబాద్‌లోనే బుల్లెట్ బండ్ల వినియోగం రోజు రోజుకు పెరిగిపోతుంది. యువత ఎక్కువ శాతం బుల్లెట్ బండ్లు కొనేందుకే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. బుల్లెట్ బండ్లు కొనటమే కాదు.. వాటికి వచ్చే డుగ్గు డుగ్గు శబ్ధాన్ని మరింత పెంచేందుకు కొత్త కొత్త సైలెన్సర్లు పెట్టి రోడ్లపై చక్కర్లు కొడుతుంటారు. ఈ క్రమంలో పోలీసులు ఇలాంటి బండ్లపై ఫోకస్ పెట్టారు. ఎక్కువ శబ్దం చేస్తూ చక్కర్లు కొట్టే బుల్లెట్ బండ్లను గుర్తించి పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు.