తెలంగాణ పోలీసులు దేశానికి రోల్ మోడల్ అని ప్రభుత్వం చెబుతుంటే.. కొందరు పోలీసులు ఆ శాఖ ప్రతిష్ఠను దిగజారుస్తున్నారు. తమ చేష్టలు, చర్యలతో డిపార్ట్మెంట్ పరువు తీస్తున్నారు. తాజాగా.. ఓ ట్రాఫిక్ ఏసీపీ డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తూ హైదరాబాద్లో అడ్డంగా దొరికిపోయాడు. మిత్రులతో కలిసి మందు పార్టీ చేసుకొని తిరిగి వస్తుంటే.. పోలీసులు పట్టుకున్నారు. అప్పటి వరకూ డ్రైవింగ్ సీట్లో ఉన్న ఏసీపీ.. పోలీసులను చూడగానే వెనుక సీట్లోకి మారిపోయాడు. ఆ తర్వాత స్నేహితుడికి డ్రంకెన్ డ్రైవ్ టెస్ట్ చేసేందుకు ప్రయత్నించిన పోలీసులపై చిందులు వేశాడు.