మద్యం సేవించి వాహనాలు నడపటం నేరం. అలా వాహనాలు నడిపేవారికి ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించి కేసులు బుక్ చేస్తారు. ఇది సాధారణంగా జరిగేదే. అయితే ఓ ట్రాఫిక్ పోలీస్ ఉన్నతాధికారి డ్రంకెన్ డ్రైవ్లో దొరికితే. హైదరాబాద్ ఎస్ఆర్ నగర్లో అటువంటి ఘటనే చోటు చేసుకుంది. డ్రంకెన్ డ్రైవ్లో ఓ ఏసీపీ పట్టుబడ్డాడు. మహిళా కానిస్టేబుల్ చాకచక్యంగా వ్యవహారించటంతో అతడు పోలీసులకు చిక్కాడు.