డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడిన మందుబాబులకు మంచిర్యాల జిల్లా న్యాయమూర్తి వినూత్నంగా శిక్ష విధించారు. పట్టుబడిన మందుబాబులంతా.. జిల్లా కేంద్రంలోని మాతాశిశు సంరక్షణ కేంద్రంలో శానిటరీ పనులు చేయాలని తీర్పునిచ్చారు. నేటి నుంచి వారంలో రోజుల పాటు కేంద్రంలో క్లీనింగ్ పనులు చేయాలని తీర్పు వెల్లడించారు.