తెలంగాణ ప్రభుత్వం మత్తు పదార్థాల వినియోగాన్ని అరికట్టేందుకు రాష్ట్రవ్యాప్తంగా 35 అడిక్షన్ ట్రీట్‌మెంట్ ఫెసిలిటీ కేంద్రాలను ప్రారంభించింది. గాంధీ ఆసుపత్రిలో ప్రత్యేక ఎస్ఐసీయూ, కౌన్సెలింగ్ కేంద్రాలను అందుబాటులోకి తెచ్చింది. TGANB అందించే అత్యాధునిక కిట్‌ల ద్వారా 12 రకాల డ్రగ్స్‌ను నిమిషాల్లోనే గుర్తిస్తున్నారు. బాధితులకు 6 వారాల పాటు పునరావాసం కల్పిస్తూ.. చట్టపరమైన నిబంధనల ప్రకారం చికిత్స అందించడం ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశమని అధికారులు చెబుతున్నారు.