డ్రైవర్ సుబ్రమణ్యం హత్య కేసులో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు అరెస్ట్ అయ్యారు. ఈ కేసులో బెయిల్ రద్దు పిటిషన్‌పై రాజమహేంద్రవరం కోర్టు శుక్రవారం విచారణ జరిపింది. ఈ విచారణకు ఎమ్మెల్సీ అనంతబాబు, ఆయన భార్య లక్ష్మీదుర్గ వచ్చారు. విచారణకు హాజరైన అనంతరం కోర్టు నుంచి బయటకు రాగానే అనంతబాబును పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం కాకినాడలోని సర్పవరం పోలీస్ స్టేషన్‌కు తరలించారు.