తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న వడ్డీ రాయితీ పథకం ద్వారా మహిళా స్వయం సహాయక సంఘాలకు (SHGs) ఆర్థిక ఉపశమనం లభిస్తోంది. ఆదిలాబాద్ జిల్లాలో తాజాగా మూడో విడతలో భాగంగా 4,087 సంఘాల ఖాతాల్లో రూ.2.76 కోట్లు జమ అయ్యాయి. అంతకుముందు రెండు విడతల్లో రూ.6.99 కోట్లు విడుదలయ్యాయి. జిల్లాలో సుమారు 91,161 మంది సభ్యులు ఈ రాయితీని పొందుతున్నారు. బ్యాంకు లింకేజీ రుణాలు సక్రమంగా చెల్లించిన వారికి ఈ వడ్డీ తిరిగి లభిస్తుంది. అయితే.. మహిళా సంఘాలు 2018-19 నుంచి పెండింగ్‌లో ఉన్న రాయితీని కూడా విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.