Andhra Pradesh Dwcra Women Revolving Fund Rs 15000: కొత్త డ్వాక్రా సంఘాలకు ఏపీ ప్రభుత్వం శుభవార్త అందించింది. ఒక్కో సంఘానికి రూ.15 వేల చొప్పున రివాల్వింగ్ ఫండ్ ప్రకటించింది. ఈ నిధులు సంఘం ఖాతాలోనే ఉంటాయి, తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదు. దీనివల్ల సంఘాల ఆర్థిక స్వావలంబన పెరుగుతుంది. గ్రామీణ రోడ్ల నిర్మాణానికి రూ.47.84 కోట్లు, కస్తూర్బా విద్యార్థినులకు రూ.10.76 కోట్ల ఉపకారవేతనాలు విడుదలయ్యాయి. సోలార్ ప్లాంట్‌కు స్టాంపు రుసుము మినహాయింపు ఇచ్చింది.