డ్వాక్రా మహిళలను దృష్టిలో పెట్టుకుని ఏపీ ప్రభుత్వం మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టనుంది. డ్వాక్రా మహిళా సంఘాలతో కూరగాయల సాగు చేయించి.. ఆ ఉత్పత్తులను ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే విద్యాసంస్థలకు సరఫరా చేయాలన భావిస్తోంది. విజయనగరం జిల్లాలో ఇప్పటికే పైలెట్ ప్రాజెక్టు కింద ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని భావిస్తున్నారు. కాంట్రాక్టర్ల స్థానంలో డ్వాక్రా మహిళా సంఘాల ద్వారానే కూరగాయల సాగు, సరఫరా చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది.