ఢిల్లీలో జనవరి 26వ తేదీన నిర్వహించనున్న గణతంత్ర వేడుకలకు దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖులు, ప్రతిభావంతులు, రాజకీయ ప్రముఖులు, విశేష అతిథులు హాజరువుతారు. అయితే.. ఈ వేడుకలకు ప్రత్యేక అతిథులు కూడా హాజరుతారు. ఆ ప్రత్యేక అతితుల్లో తెలంగాణ వాళ్లు కూడా ఉన్నారు. అది కూడా ఒకరో ఇద్దరో కాదు.. ఏకంగా 41 మంది ప్రత్యేక అతిథులు.. రిపబ్లిక్ డే పరేడ్‌లో పాల్గొననున్నారు. వాళ్లందరికీ కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ఆహ్వానం అందించింది.