ఢిల్లీ కేంద్రంగా నిర్వహిస్తున్న ఫేక్ సైబర్ కాల్‌సెంటర్లను తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో పోలీసులు ఛేదించారు. ఈ ఆపరేషన్‌లో 21 మంది తెలుగు మాట్లాడే మహిళా టెలీకాలర్లతో పాటు ఓ బ్యాంక్ ఖాతాదారుడిని అదుపులోకి తీసుకున్నారు. బజాజ్ ఫైనాన్స్ ప్రతినిధులమంటూ నమ్మించి ఆకర్షణీయమైన లోన్ ఆఫర్లు చూపించి, ప్రాసెసింగ్ ఫీజు, వెరిఫికేషన్, డాక్యుమెంటేషన్, బీమా పేరుతో బాధితుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.