తండ్రిని హత్య చేయించిన కూతురు.. ఆ పని వద్దన్నందుకే.. ఓవరాక్షనే కొంపముంచింది..!

1 month ago 5
అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేటలో దారుణం జరిగింది. రాంబాబు అనే వ్యక్తిని ఆయన కుమార్తె హత్య చేయించింది. రాంబాబు మరణంపై సోదరుడి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల దర్యాప్తులో కుమార్తె, తండ్రిని హత్య చేయించినట్లు తేలింది. దీంతో ఈ కేసులో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. కోర్టులో హాజరుపరచగా.. కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. అయితే వివాహేతర సంబంధానికి అడ్డుచెప్పాడనే కోపంతోనే రాంబాబు కుమార్తె ఈ పని చేసినట్లు పోలీసులు తెలిపారు.
Read Entire Article