తనకు దక్కలేదనే కోపంతో ఓ యువతిపై కోపం పెంచుకుని ఆమె నగ్న చిత్రాలను కుటుంబ సభ్యులకు పంపించి వేధించిన ఘటన కృష్ణా జిల్లాలో చోటుచేసుకుంది. ఓ కాలేజీలో హౌస్ కీపింగ్ సూపర్‍వైజర్‌గా పనిచేస్తున్న వ్యక్తి.. గతంలో తనతో పాటు పనిచేసిన అమ్మాయితో సన్నిహితంగా మెలిగాడు. ఈ సమయంలో కొన్ని ఫోటోలు తీసుకున్నాడు. అలాగే న్యూడ్ ఫోటోలను వాట్సాప్ ద్వారా సేకరించాడు. విభేదాలు వచ్చి విడిపోవటంతో ఇప్పుడు ఈ ఫోటోలను ఆమె కుటుంబ సభ్యులు, బంధువులకు పంపి వేధించడం ప్రారంభించాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుణ్ని అదుపులోకి తీసుకున్నారు.