జగిత్యాల జిల్లా బీర్ పూర్ మండలం తుంగూరు గ్రామంలో ఓగులపు అజయ్ అనే యువకుడు తనకు ఆడపిల్ల పుట్టిందని ఊర్లో ఉన్న ప్రతి మహిళకు చీరల పంపిణీ చేశాడు. మహాలక్ష్మి మా ఇంటికి వచ్చిందంటూ ఇంట్లో సంబరాలు నిర్వహించాడు. దాదాపు 1500 చీరలను ఇంటింటికి తిరుగుతూ పంపిణీ కార్యక్రమం పూర్తి చేశాడు. ఆడపిల్ల అంటే మహాలక్ష్మి అని సంతోషంగా చీరలను పంపిణీ చేసినట్లు అజయ్ తెలిపాడు. అయితే అజయ్‌కి దుబాయ్‌లో ఉండగా.. గత రెండేళ్ల క్రితం రూ.30 కోట్ల లాటరీ తగిలి ఒక్కసారిగా కోటీశ్వరున్ని చేసింది. తాజాగా అతనికి ఆడపిల్ల పుట్టడం మరింత సంతోషాన్ని ఇచ్చిందని అజయ్ పేర్కొన్నాడు