AP CM Chandrababu Naidu called Tamil Nadu CM Vijay: ఆంధ్రప్రదేశ్‌పై 'మురసు' తుపాను ప్రభావం చూపే అవకాశం ఉందన్న హెచ్చరికలు ఉన్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు ముందస్తు చర్యలను వేగవంతం చేశారు. 'తమిళనాడు ప్రభుత్వం నుంచి విద్యుత్ వ్యవస్థల పునరుద్ధరణకు సహాయం కోరుతూ తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌కు చంద్రబాబు ఫోన్ చేశారు. మురసు తుఫాను వల్ల పెద్ద ఎత్తున విద్యుత్ పోల్స్ దెబ్బ తింటాయని, పునరుద్ధరణకు సిబ్బందిని, యంత్రాలను పంపాలని కోరారు. తమిళనాడు సీఎం దీనికి సానుకూలంగా స్పందించారు' అని సీఎంవో ట్వీట్ చేసింది.