రాజకీయాల్లో ఎన్నో పార్టీలు వస్తుంటాయని, పోతుంటాయని టీఆర్ఎస్ పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. అయితే కొన్ని పార్టీలు మాత్రమే సక్సెస్ అవుతాయని.. మరికొన్ని పార్టీలు ఫెయిల్ అవుతాయని తెలిపారు. సక్సెస్, ఫెయిల్యూర్ అయిన పార్టీలను తాము చూశామని.. ప్రజల్లోకి టీఆర్ఎస్ పార్టీ బలంగా దూసుకెళ్తోందని చెప్పారు. తమిళనాడులో విజయ్‌ని చూసిన తర్వాత తెలంగాణలో తాము అధికారంలోకి వస్తామని ధైర్యం వచ్చిందని కవిత వెల్లడించారు.