ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త ఓ దొంగ అని తెలిసి భార్య కఠిన నిర్ణయం తీసుకుంది. పోలీసులు ఇంటికొచ్చి మరీ చోరీ కేసుల్లో భర్తను అదుపులోకి తీసుకోవడాన్ని జీర్ణించుకోలేక పోయింది. తల్లిదండ్రులను ఎదురించి ప్రేమ వివాహం చేసుకుంటే తలెత్తుకోలేకుండా చేశాడని అవమానంగా ఫీలైంది. ఇక బతికుండటంలో అర్థం లేదని.. తన ఇద్దరు పిల్లలకు ఉరేసి ఆపై తాను కూడా సూసైడ్ చేసుకుంది. ఈ విషాదకర ఘటన ఖమ్మం జిల్లాలో చోటు చేసకుంది.