Ongole Son Sets House On Fire Mother Dies: ప్రకాశం జిల్లా ఒంగోలు గద్దలగుంటలో దారుణం జరిగింది. ఓ యువకుడు తల్లిని ఇంట్లోనే ఉంచి నిప్పుపెట్టాడు. పాపం ఆమె మంటల్లో కాలి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. స్థానికులు వెళ్లి కుమారుడ్ని ప్రశ్నించగా.. అతడు ఇంటి నుంచి పారిపోయాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే నిందితుడి మానసిక స్థితి సరిగా లేదని చెబుతున్నారు.