మహిళా రైతు తారవ్వ కష్టం ప్రతి ఒక్కరిని కదిలిస్తోంది. ధాన్యం అమ్మడం కోసం హుస్నాబాద్ మార్కెట్‌కు వచ్చిన పంటను తరలించిన తారవ్వకు అక్కడ నిరాశ ఎదురైంది. తేమ శాతం ఎక్కువగా ఉండటంతో అధికారులు వడ్లు కొనలేదు. దీంతో తిరిగి ఎండబెట్టింది. ఇంతలో కుండపోత వాన కురిసి.. ఎండబోసిన వడ్లు కొట్టుకుపోయాయి. 80 శాతం ధాన్యం కొట్టుకుపోవడంతో తారమ్మ కన్నీరుమున్నీరు అయ్యింది. మార్కెట్‌కు వచ్చిన కలెక్టర్ కాళ్లు పట్టుకుని ఆదుకోమని కోరడం ప్రతి ఒక్కరిని కదిలింది. దీనిపై కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పందిస్తూ.. తారవ్వకు అండగా ఉంటానన్నారు.